ఓపెన్ బుక్ వారోత్సవాలు-2
ఓపెన్ బుక్ వారోత్సవాలు-2
ఓపెన్ బుక్ వారోత్సవాలు-2
దేవుడి దయనుకోవాలో ఏమో మొదటి రెండు పరీక్షలు అయిపోయాయి
ఇంక రెండో weekend ఈ సారి ఉన్న పరీక్షలలో మరీ భయంకరమైన పరీక్ష
ఆ పరీక్ష పేరు "DAA" డా ఈ subject ఎందుకు పెట్టారో నాకు అస్సలు అర్థం కాదు
నేను రాసేది 5 వ semester కానీ గత మూడు సెమిస్టర్లు గా ఈ సబ్జెక్ట్ నన్ను ఏదో ఒక పేరు తో వెంటాడుతూనే ఉంది.
ఒక సెమిస్టర్ లో "PLCC" అంటారు
ఇంకో సెమిస్టర్ లో "DSA" అంటారు
ఇంకో సెమిస్టర్ లో "APT" అంటారు
ఎ subject ఎదురైనప్పుడల్లా
రూపమెదైనా భగవంతుదు ఒక్కడే అన్నట్టు పెరేదైనా subject మాత్రం ఒక్కటే
ఇలా అనుకోవాలో లేక దరిద్రం పది రకాలు అని అనుకోవాలో అర్థం అవ్వదు నాకు
ఎవ్వరిని అడుగుదాం అన్నా అందరిదీ అదే పరీస్థితి
"Daa has always been a pain in our A**" అని సీనియర్లే అంటుంటే బచ్చాగాళ్ళం మా పనేంటీ అని నాకు అగమ్య గోచరంగా ఉండింది
మునుపు మనం చెప్పుకున్నట్లుగా త్రైమాసిక పరీక్షలలో(midsem) ఈ subject లో కూడా అందరు ఆశ్చర్యార్థకరమైన ప్రదర్శన చేసారన్న మాట
నిజం చెప్పాలంటే దిక్కులేని పరిస్థితి మరి ఈసారి కష్ట పడి చదివి గట్టి మార్కులు తెచ్చుకోవాలన్న తపన తో సోమవారం నుంచే మొదలెట్టాం preparation
కానీ సోమ వారం మొదలెట్టిన వ్రతాలు ఎమౌతాయి ?????
1)నిరంతరం గా సాగుతాయి
2)మళ్ళీ సోమ వారం వరకు సాగుతాయి
3)ఏమొ చెప్పలేము
4)మంగళవారమ రోజు ఆగిపోతాయి
మీ జవాబు 1) లేక 2) ఐతే మీరు పప్పులో కాలేసినట్టు మీ జవాబు
3) లేదా 4) అయితే జవాబు నెనే చెప్తా,,, మంగళవారం ఆగిపోయింది
printer పర్యావరణానికి సహకరించిది నాకు చేయిచ్చింది
prints తీయలేక పోయా (తీసినా పొడిచేది ఏమి లేదనుకొండి)
మంగళవారం రోజు చదువుదాం అని కూర్చున్న నన్ను మంచు మనోజ్ కుమార్ బాబు "ప్రయాణం" అనే పేరు తో "వారాఇ నాన్ ఉన్ తేడీ"
ఓ ఉనక్కు తమిళ్ తెరియాదా ???
"రా రా సరసకు రా రా" అని పిలిచాడు
వాడు రమ్మన్నాడు మేము ఎగేసుకుంటూ వెళ్ళిపోయాము
వెళ్ళే మంచి పని చేసాను లేకపోయుంటే మరో రెండు గంటలు ఆ "DAA" మీద తగలేసే వాడిని
ఈ విధంగా రెండు రోజులు అయ్యాయి
ఇక మూడో రోజు
ఈ రోజు ఆఫీస్ నించి తిన్నగా KOTI కి బయలుదేరాము
బహుశా చాలా పుస్తకాలు కొనేయాలి అని feel అయ్యాడో ఏమో ఉదయ్ గాడు మొదట బలిచ్చే మేకను మేపినట్టు నన్ను Gokul chat లో మేపి ఇంక వాడి "బుక్కు మేధ యాగం" (అంటే ఏంటి అని అడగకండి నేనేదో ప్రాస కోసం వాడాను) మొదలెట్టాడు
వీడికి ఒక పట్టాన ఏవి నచ్చవు!!! మూడు shops తిరిగాం పెద్ద book depo లే కాని వీడికి నచ్చలేదు ఏదో వెతుకుతాడు
వీడికి బుక్కులు వెతకడం లో ఉన్న శ్రద్ధలో ఓ చటాక్ శ్రద్ధ నాకో కామెశ్ గాడికో ఉండుంటే ఈ పాటికి IIT లో ఉండే వాళ్ళమేమో
Under ground లోకి తీసుకెళ్ళాడు అక్కడ చిన్న Book shop వాళ్ళని
"నాకు case-studies ఉన్న books కావాలి అంటాడు
వీడు అడిగిన బుక్కు ఏంటో అర్థం కాక వాడు బిక్క మొహం వేస్తాడు
ప్రతి shop లో ఇదే తంటా
మొత్తానికి తిమ్మిని బమ్మి చేసి ఏదో విదం గా అన్నీTopics ఉన్న ఒక book సంపాదించి అది నాకు వాడికి కామేశ్ గాడికి తీస్కుని అక్కడినించి బయలుదేరి రాత్రి 10 ఇంటికి sweet home చేరాము ఈ విధంగా మూడో రోజు కూడా ఐపోయింది
మిగిలిన మూడు రోజులు ఏం చేసాం ఎలా చదివాం ??
సశేషం ....
Comments
comparison keka