ఓపన్ బుక్ వారోత్సవాలు-3


ఓపన్ బుక్ వారోత్సవాలు-3

మొత్తానికి మూడు రోజులు తగలేసాం చదవకుండా
ఇక నాలుగో రోజు గురువారం గురు బలం ఉంటుంది చదవడం మొదలెడదాం అని అనుకున్నా
ఈ గురుబలం అంటే ఏంటి అని ప్రశ్న వద్దు ఎందుకంటే అదేంటో నాకు కూడా తెలీదు

మూడు రోజులే మిగిలాయి ఏదో చదివేయాలి చదివేయాలి అన్న తపనే కానీ ఏమీ చదవలేక పోయా
printer మళ్ళి పర్యావరణానికే సహకరించింది
అసలే పరీక్షల బాధ వెంటాడుతుంటే మధ్యలో interviewలు పోని
interviewల మీద సీత కన్నేద్దామా అని అనుకుంటే 6 నెలల నించీ bench

అక్కటా ఏమి ఈ విధి వైపరీత్యము ఈ ధర్మ సంకటము నందు ఏమి నా తక్షణ కర్తవ్యము
మరీ ఇంత హెవీ గా ఆలోచించలేదు గాని వెళ్ళి
interview attend అయ్యా
ఓ గోల అయిపోయింది అని అనుకుంటున్న Time లో ఆకలేసింది
నాకు ఆకలేస్తే అన్నం పెడతా అని యానా గుప్తా రాడానికి నేనేమైనా మెగాస్టార్ చిరంజీవి నా కాదు !!!
సో చేసేది ఏఅమి లేక 12 ఇంటికి break fast చేయడానికి వెళ్ళా
break fast కి వెళ్ళీ కష్ట సుఖాలు చర్చించుకుని వచ్చే సరికి time 1.00 ఏముంది lunch కి time అయ్యింది చలో canteen,
Lunch అయ్యి వచ్చే సరికి 3:00 ఇంక printer ని నమ్ముకోకుండా ఏదో ఒకటి చదువుదాం అని పుస్తకం తీసి చూస్తే నాకు ఈ DAA కన్నా 10త్ Class Bismark answer తేలిక అనిపించింది
ఎంత ఎక్కిద్దాం ఎక్కిద్దాం అని try చేసినా ఏమీ ఎక్కలేదు

నా ఊహల పల్లకీ చి చి కాదు నా
ఊహల దెయ్యాల కోటలో మా DAA Lecturer నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అని స్తెప్పులేసేస్తున్నాడు
ఇంక చేసేది ఏమి లేక
నేను క్లాస్ లో రాసుకున్న Notes తీసా
ఆ పుస్తకం ఎండకు తడిసి వానకు ఎండి పురావస్తు శాఖ తవ్వకాలలో బయట పడిన తాళ పత్ర గ్రంథం లా ఉండింది అయినా పర్లేదు చదవాల్సిందే అని చదివా ఏవో రెండు మూడు Topic లు తలలో కి ఎక్కాయి
ఈ లోపల "నిలిచిపో సమయమా....." అని పాడుకోవడం మర్చిపోయినట్టున్నా 6:00 అయ్యింది
ఇంకేముంది మూటా ముల్లే సద్దుకుని పరుగో పరుగు బస్సు కోసం

ఇంటికెళ్ళి చదువుతామ లేదు TV ముంది ఠీవి గా కూర్చుని ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు
రాజా వారు కష్ట పడి అలిసిపోయి వచ్చారనుకుని ఇంట్లో సేవలు
ఆ sleep ని ఓ 10 మిన్స్ slip చేసి నా గండిపేట్ సారీ నా పేట్ (అంటే పొట్టండోయ్) లోకి ఎక్కువ కాకుండా కొన్నే ఓ అర డజను దోసలను తోసేసి
చీ నా బతుకూ అనుకుని పుస్తకం పట్టా
ఎమౌతుంది మీకు తెలీదేంటి స్వప్నవేణువేదో సంగీతమాలపించింది
సుప్రభాత వేల శుభమస్తు గాలి వీయడం కాదు శుభం కార్డు పడేటట్తు తయారయింది నా పరిస్తితి

నాకూ నిద్రకి భీకర పోరు జరిగింది
ఏమైతది నిద్ర హీరో నేను ఖాళీ విలన్ నిద్ర చేతిలా ఇంకో సారి ఓడిపోయా నెను నిద్ర కి తలవంచాన్

నా నలుగో రోజు చదువుకి కూడా తెర పడింది ....

సశేషం...

Comments

నాకూ నిద్రకి భీకర పోరు జరిగింది
ఏమైతది నిద్ర హీరో నేను ఖాళీ విలన్ నిద్ర చేతిలా ఇంకో సారి ఓడిపోయా నెను నిద్ర కి తలవంచాన్ -- charitra cheppe katha ide darling :-)

Popular Posts