ఓపెన్ బుక్ వారోత్సవాలు-1


ఓపెన్ బుక్ వారోత్సవాలు-1

మన జీవితం లో మనకి తెలిసో తెలియకో సగం సమయం మనం దేనికి కెటాయిస్తామో తెలుసా
పరీక్షలు అని చెప్పి వాటి పేరు తో చదవడానికి అవి రాయడనికి
మీ సంగతి నాకు తెలీదు కాని నాకయితే డిగ్రీ పూర్తి చేసి ఎం ఎన్ సి లో పని చేస్తున్నా కాని ఈ తంటాలు తప్పట్లేదు
ఈ మధ్యే రాసిన రెండు ఓపెన్ బుక్ ఎగ్జాంస్ కి మా ప్రిపరేషన్ ఎలా ఉందో చెప్పెదేటి
వద్దూ !! అని మీరు అన్నా తప్పదు అని నేను అంటాను

అసలు పరీక్ష రాయలంటే దానికి నెల రోజుల ముందు నించీ చదువు మొదలెట్టడం
చిన్నప్పటి పద్దతి ఇప్పుడంతా ఆధునికం కదా సో పరీక్షకి చదవతం మొదలెట్టేది
ఒక రోజు ముందు ..

తొక్కలోది దీనికి మల్లి ఓన్ డే బాటింగ్ అని పేరు
అందులో ఇది ఓపన్ బుక్ కాబట్టి ఆ ఒక్క రోజు కూడా చదవాలి అన్న ఫీలింగ్ అస్సలు రాలేదు
కాని చదవాలి ఎందుకంటే మిడ్ సెం అని త్రై మాసిక పరీక్ష ఒకటి ఉంటుంది అందులో అత్యద్భుతమైన మార్కులు వచ్చాయి మనకి
అందుకే ఓపెన్ బుక్ కి గట్టి బందోబస్తే చేసం

ఏ టాపిక్ కనిపించినా నాయాల్ది దొరికిందే సందు అని ప్రింట్ తీసేసి
కోటి లో కనిపించిన ప్రతి బుక్ షాప్ లోకి వెల్లి అడ్డమైన పుస్తకాలు కొనేసి
పుస్తకాల సంచీ సైజు చూసుకుని ప్రెపరేషను స్ట్రాంగ్ గా ఉందని మురిసిపోయా

శని వారం రానే వచ్చింది టీం వర్క్ బాగ పని చేస్తుంది అని కామేశ్ గాడి తో కలిసి కూర్చున్నా
జోగి జోగి కలిసి కూర్చుని ఏదో బూడిద రాల్చాలని గట్టి ప్రయత్నమే చేసాం

వాడు నేను తీసుకున్న ప్రింట్ ఔట్స్ చూసి ఒరేయ్ ఏంటి రా ఇది ఇన్ని ప్రింట్సా నీ వల్ల ఎన్ని చెట్లు బలౌతున్నయో నీకు తెలుసా ? ఎన్ని అడవులు నాశనం ఔతున్నయో నీకు తెలుసా అని అడిగాడు

నిజంగా ఆ క్షణం వరకూ జనాలు ఇలా కూడా ఆలొచిస్తారు అని నాకు తెలీదు

సాయంత్రం వరకూ ఎదో పీకేసాం అన్న ఫీలింగ్ తో ఉన్న మాకు తోడు గా ఉదయ్ గాడు జాయిన్ అయ్యాడు
ఇక్కడ ట్రిపుల్ ప్లాటినుం బూడిద రాలింది అన్న మాట
కాని వీడు రావడం ఒకందుకు మంచిదే అయ్యింది పుస్తకం లో అ పేజీ లో ఏముందో మాకు అప్పుడే తెలిసింది

ఎందుకంటే నాది కామేశ్ గాడిది ఓన్ డే బాటింగ్ అంటే ఉదయ్ గాడిది టెస్ట్ మాచ్ అని చెప్పుకోవచ్చు

అగ్యానాంధకారం లో బతుకుతున్న మా జీవితాలలో ఒకే సారి 1000 అగరత్తుల వెలుగు నింపేసాడు

ఇప్పటికీ అసలెందుకు రాస్తునామో రాస్తే ఒరిగెదేంటో
ఇలా ప్రెపరేశన్ పేరు తో అమూల్యమైన శని ఆది వారలను వేస్ట్ చేయడమేంటో అని కామేశ్ గాడి ఫీలింగు
ఎగ్జాంసా నేనా అన్నది ఉదయ్ గాడి ఫీలింగు

ఏదో నాకొచ్చిన నాలుగు ముక్కలు వీడికి కూడ చెప్దాం ఒక్కడినీ కూర్చుని చదివే బదలు ఇద్దరం కూర్చుని చదవడం మంచిది కదా అని ఈ సారైనా సరిగ్గా రాసి మాంచి మార్కులు తెప్పించుకుందా అని నా ఫీలింగు

నిజం చెప్పాలి అంటే నా బొంద చదివింది ఏమి లేదు ఏదో ఒక ప్రింట్ ఔట్ చూడటం ఇది నాదెగ్గర్లేదు నా దెగ్గరలేదు అనుకోవడం జిరాక్స్ షాప్ కి పరిగెత్తడం అది జిరాక్స్ తీసుకోవడం ఇది ప్రిపరేషన్ అంటే
నాకు తెలిసి నా జీవితం లో ఎక్కువ డబ్బులు ఈ సారి ఓపెన్ బుక్ కే ఖర్చు పెట్టి ఉంటాను

మధ్యలో మేమెక్కడ చదివి పీకేస్తున్నమో అని జనాలు ఫోన్ చేసి మరీ వాకబు చేయడం ???? నాకైతే ఇలాంటి వాళ్ళని జూ లో పెట్టలనిపిస్తుంది
ఏంటో పరీక్షలంటే అన్ని వింతలు ఒకే సారి జరుగుతాయి అనిపిస్తుంది

మొత్తానికి రాత్రి 11 అయ్యింది మా సో కాల్డ్ చదువు పూర్తి అవడానికి
మా పుస్తకాలు సద్దుకుని మళ్ళీ కామేశు ఉదయ్ తిరిగి వాల్లింటికి బయలుదేరుతుండగా
నాకు చైతు గాడు వాడి మటీరియల్ ఏదో ఇస్తాను అన్నాడన్న సంగతి గుర్తొచ్చింది
అది గుర్తొచ్చి నేను కుద 11:40 నా గుర్రమెక్కి వదిని అనూటెక్స్(షో రూం పేరు లేండి) దెగ్గరికి రమ్మని చెప్పి బయలుదేరి వెళ్తే
నా దరిద్రం తగలడ రాత్రి 12 ఇంటికి కూడా గూడ్సు బండి వెల్లి గేటు పడి 15 నిమిశాలు వెయిట్ చేయాల్సి వచ్చింది

ఇంతా కష్ట పడి మరుసటి రోజు ఎగ్జాం కెళ్తే
విధి వెక్కిరించింది
దీనమ్మ చుక్కలు కనిపించాయి పేపరు లో

"ఏన్ పి" "ఏన్ పి" అని కిందా మీద పడి దొర్లి
"టి సి" మీద సీత కన్ను వేసాం కాని "టి సి" పేపరు ని చినిగి చాట అయ్యేటట్టు ఇచ్చారు
ఒక పాసేజ్ అయితే సూపర్ మాన్ రిటర్న్స్ సినిమాలో థీం లాగ క్రిస్టల్సు రెఫ్లెక్షన్సు పాత సామన్లు చెత్త చెదారం అని ఇచ్చాడు మతి దొబ్బింది మబ్బులు కనిపించాయి చదివిన తరవాత
కాట్ ఎగ్జాం లో ఐనా ఇలాటి పాసేజ్ ఇయ్యరేమో

కానీ ఏం చేస్తాం చిన్నప్పడి నించీ రాస్తూనే ఉన్నాం కదా
చెట్టు గురించి ఏం రాయలో తెలియకపోతే చెట్టు కి గొర్రె ని కట్టేసి గొర్రె గురించి రసేస్తాం
"ఎదవ టాలెంట్" అనే మాట మమ్మల్ని చూసేయ్ కనిపెట్టుంటారు అని నా ఫీలింగ్
ఎగ్జాం హాల్ లోంచి బయటకొచ్చిన తరవాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని వెకిలి నవ్వులు
వచ్చే సేం నించి ఇలా కాదు సీరియస్ గా చదువుదాం అని కంక్లూషన్ లు
కాని ఎమౌతుంది ??? కుక్క తోక ఒంకరౌతుంది....

మరి మీ పరీక్షల సంగతేంటి ?????

:) ............... సశేషం

Comments

ఎగ్జాం హాల్ లోంచి బయటకొచ్చిన తరవాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని వెకిలి నవ్వులు
వచ్చే సేం నించి ఇలా కాదు సీరియస్ గా చదువుదాం అని కంక్లూషన్

anduke darling -- monna exams tarvaata naa conclusion emiti ante --ippati nunchi no conclusion after exams.... :-) :-) :-)

Popular Posts