ఓపన్ బుక్ వారోత్సవాలు-4


ఓపన్ బుక్ వారోత్సవాలు-4

నా చివరి రెండు రోజుల preparation ఈ టీవి సీరియల్ లా సాగింది
నా యాల్ది Twistలే Twist లు
ఆ రోజు అసలు office కి రావడమే ఆలస్యంగా వచ్చా అప్పటికే సగం time అయిపోయింది
ఇంకా ఆరోజు నాకు విపరీతమైన ఆకలి తిండి కి మళ్ళీ Time
ఏం చదవాలి ఎలా చదవాలి అని నేను విస్సూ కలిసి నిర్ణయించుకుని నా గూటికి నేను బయలుదేరాను
అనుకున్నది అనుకున్నట్టు చదువుదాం అనుకునేసరికి ఆ రోజు printer పర్యావరణానికి కాకుండా నాకు సహకరించింది ఐనా కాని ఉపయోగించుకోలేక పోయను ఎందుకంటే అప్పుడు ఏం తీయాలొ అర్థం కాలేదు

ఇది మొదటి ట్విస్టు-printer సహకరణ

చదువుదాం అని decide అయ్యే సమయానికి phone ఒచ్చింది
"శేఖర్ ఎక్కడున్నవ్ ఓ సారి conference room కి రావా అని"
సరే వస్తున్నా !!! ఏముంది చలో conference room కి
అక్కడ మా batch అమ్మాయిలు ఓ material పట్టుకుని ready
దాని xerox తేవడానికి నాకు call అన్నమాట
material చూస్తే genuine అనిపించింది సొ అది తీస్కురాడానికి ఏం plan వేయలా అని నా దీర్ఘాలోచన
ఈ లోపల lunch కి time ఐంది
సరే lunch తరవాత చూద్దాం అని చెప్పి lunch కి jump
ఈ Drama కి ఇక్కడ నాకు రెండు గంటలు బొక్క

Lunch అయ్యింది Desk దెగ్గరికి వచ్చి mail చూస్తే అక్కడ ఉంది
రెండో Twist - appraisal
appraisal పూర్తయ్యింది చూసుకోరా వెధవా అని
Net Slow మన దరిద్రం Break Dance సంగతి తెలిసిందే కదా
అది ఓపనై నేను చూసుకునే లోపు నాకెక్కడ మంచి rating వచ్చిందో అని ఏడిచి చచ్చిపోయే వెధవల calls attend చేసి ఆ సంత సద్దేసి వచ్చేటప్పటికి ఇంకో గంట

ఇప్పుడు xerox కోసం వెళ్ళాలా ? అని మనసులో doubt
చేసేదేమి లేక నేను భాబీ బయలుదేరాము
మధ్యలో ఒచ్చింది చెత్త అవిడియా భాబీ కి సోపేసా పని బయటకి వెల్లకుండానే అయిపోయింది
తను stationary వాళ్ళని ఏం చెప్పి కన్విన్స్ చేసిందో తెలీదు బయటకి వెళ్ళే పని తప్పింది
" అబ్బ రాజా నువ్వు Top రా అబ్బ రాజా నువ్వు తోపు ర " అని నా భుజాలు నెనే తడుముకున్నాను
Material ఎవరైది వారికి సద్దేసి discussion కి వెళ్తే అక్కడ నాకు చెప్పింది ఏమి లేదు
నాచేత చెప్పించుకున్నారు పోని చెప్పించుకోవడం అయిన తరవాత నాకు చెప్తారేమో అనుకుంటే


ఇక్కడ Twist no 3 Hand Collection

నాకు రాని Topics చెప్తా అని చెప్పిన అమ్మాయికి చెయ్యిచ్చింది sudden గా జ్వరమొచ్చేసి తను Time 6.15 అయ్యిందని బస్సు ఎక్కేసి చెక్కేసింది

నా బతుకు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నట్టు తయారైంది
Desk కి ఒచ్చి ఉదయ్ గాడు ఉన్నడేమో అని చూసా
ఉదయ్ నేను కామేశ్ sketch వేసాం మరుసటి రోజు పొద్దున్న OU లో సరస్వతి దేవి గుడి లో మన prepration అని decide చేసి నెను phase 1 కి jump

CUT చేస్తే ఇంకో Conference Room Time ఏడు అక్కడ నేను విస్సూ కి నాకు జరిగిన అన్యాయం చిన్న కథ లా చెప్పి Discussion start చేసాం

మూడు గంటలు నిరంతరం గా సాగింది
నాకు ఆ క్షణాన Topics అన్నీ చెప్పిన సంతూ జేజమ్మ లా కనపడింది
Exam బాల్చీ తన్నదు అని అప్పుడొచ్చింది నమ్మకం

కిందకి వెళ్ళి రేష్మా Desk దెగ్గర prints తీసుకుందాం అనుకుంటే there విధి మళ్ళీ వెక్కిరించింది
(another twist non cooperation movement by printer)
Over విస్సూస్ Desk
సహకరించిన printer ని ఉపయోగించుకుని office నించి నేనూ విస్సూ 10.20 కి జంప్

Next Shot లో గచ్చిబౌలి టు పంజాగుట్ట Main Road situational గా నీ స్నేహం పాటలు గట్టిగా పాడుకుంటూ
9 టు 9 దోసా shop కి చేరాం అక్కడ Dinner ముగించుకుని
నేను నా దారి వాడు వాడి దారి పట్టి ఇంటికి చేరేటప్పటికి 12.00

ఎదిగొచ్చిన్న కొడుకు చదువు కోసం పడుతున్న తపన చూసి తల్లి పడే ఆనందం మా అమ్మ కళ్ళలో కనిపిస్తుందేమో అని చూసా
తలుపు తెరిచి
" ఏ రా వెధవా కనపడిందా ఇల్లు?? ఏ theater నించి వస్తున్నావ్?" అని అడిగారు మా అమ్మ గారు
ఇదే ఆ రోజుకి Final Twist

" అమ్మ మనసేంటో ఒక్క ముక్కలో చెప్పావమ్మ " అని నేను రాత్రి 12 ఇంటికి కూడ కామెడీ చేయడానికి ట్రై చేసా
ప్చ్ వర్కౌటవ్వలేదు

ఇంకేం చేస్తాం తొంగుంటాం ...


చివరి భాగం సశేషం .......

Comments

ee vaarotsavaalalo ee bhaagam chaala chakkaga undi :P:P

guess y
Raja said…
ilaaa nannu encourage chesthey ilanti varothsavaalu kadu nelothsavalu samvathsarothsavalu puttisthaaa :)

Popular Posts