అటు నువ్వే ఇటు నువ్వే

Singer:Neha Bhasin
Lyrics:Ramajogayya Sastry
Music Director:Devi Sri Prasad
Movie Curr

అటు నువ్వే ఇటు నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చొటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరపైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే

అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీవలనా
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రానా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే

రంగు రూపమంటు లెనే లెనిదీ ప్రేమా
చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ వుంది

దూరం దెగ్గరంటు నీడ చూడదు ఈ ప్రేమ
నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుంది

కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైన మరపే రావుగ

ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నెను లేనే లేను అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చొటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరపైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే

నాకే తెలియకుండా నాలో నిను వొదిలావే
నేనే నువ్వయేలా ప్రెమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటు నన్ను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏ కాంతి లేదు రా
నలుసంత కూడ జాలిలేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదు రా
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చొటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరపైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే

Comments

Popular Posts