LAP TOP లో చంద్రుడు
LAP TOP లో చంద్రుడు -- ఇది మా వెంకీ గాడి LOVE STORY
PART-II
మొత్తానికి ఫ్లష్ బచ్క్ లోకి వెళ్తే
నేను నా 5th SEM Mid-sem exams కి Preparing
అప్పుడు పొరబాటున ఒక అమ్మాయిని చూసాను చూసి
అరే!!! ఈ అమ్మాయి బాగుందే అని అనుకున్నాను కానీ ఎలా approach అవ్వాలో అర్థం కాక,
Transformer లకి దూరం గా ఉండటం అలవాటయ్యి పెద్దగా పట్టించుకొలేదు
Exam రాసిన రోజు ఆ అమ్మాయిని exam hall లో మళ్ళీ చూసాను
ఇలా ఓ రెండు మూడు రోజులు continuous గా ఆ అమ్మాయి కనిపిస్తూనే ఉంది
ఇలా కనిపించడం మూలంగా అసలా అమ్మయెవరో
అని కుతూహలం కలిగి (పెరిగి) వాకబు చేస్తే ఆ అమ్మాయి
16 అణాల తెలుగమ్మాయి అందులోను మా బ్రాహ్మల అమ్మాయి అని తేలింది
ఇంకేంటి
"My hear is beating అదోలా " అని అనుకున్నాను
కాని మనకి Hero role suit అవ్వదు కదా సో heroine లు మనకు పడరు అని
I MIDDLE DROP ... :D
****
ఇదిలా ఉండగా మా వెంకీ గాడు ఒక రోజు నాతో వాడి crush గురించి చెప్పాడు
వీడు చెప్పిన పోలికలన్నీ నేను చూసిన అమ్మాయిలో ఉన్నాయి
ఇలా కాదని Exam hall లో వాడిని ఆ అమ్మాయిని చూపించమని అడిగితే ..
ఇంకేముంది మనోడు ఆ అమ్మయిని చూపించగానే
నేను SAME PINCH!!! అని గిచ్చాను
వాడు "తూచ్....." నేను ఒప్పుకోను అన్నాడు
అక్కడో చిన్న non serious
డిషుం డిషుం :)
వాడు "మామా నేను సంవత్సరమ్నర నించి try చేస్తున్నా" అని అన్నాడు
Touch చేసావ్ మామా Touch లో ఉండు అని అందాం అనుకున్నా కాని నా feelings వాడికి అర్థం కావు అని calm గా ఉన్నా
మా స్నేహం కోసం నా so called crush ని త్యాగం చేసా
(త్యాగం చేయాలి తప్పదు ఎందుకంటే basic గా నాకు crush ఉన్నా నేను పీకి పొడిచేది ఏమి లేదు కనక)
***
Exam హడావిడి గడిచి పోయిన తరవాత సాయంత్రం ఇంటిదెగ్గర కూర్చుని ఆ అమ్మాయి గురించి discuss చేసాం
అమ్మాయి గురించి నీకేం తెలుసు రా అంటే
వెంకీ గాడు అప్పుడు
అబ్బహ్......!!! అబ్బ దబ్బ జబ్బ అన్నాడు
మరేం పీకావ్ రా సంవత్సరన్నర నించి అని అడిగితే
చూసా.....!!!! చూసా.........!!! చూస్తూనే.......!!!! ఉన్నా అని సిగ్గు పడ్డాడు
తూ నీ సిగ్గు సిమడా అని అన్నా అర్ఠం చేసుకునే position లో వాడు లేడు
ఆ అమ్మాయి గురించి నాకు తెలిసిన వివరాలన్నీ వాడికి చెప్పాను
ఆ మాత్రం Information ఇస్తే ఏ అబ్బాయైనా చెలరేగి పొతాడెమో అని అనుకుంటే
మనోడు హీరో కదా so Information సరిపొలేదు
ఎదో Critical Exception చూసిన Developer లా పెట్టాడు face ని
వాడు మనో భావన అర్థం చేసుకున్న నేను నీకెందు కు రా
నువ్వేమి Worry అవకు అని, నీకు కావాల్సిన మిగితా details నేను సంపాదిస్తాను అని
Main Hoon Naa అని ఓ పెద్ద అభయ హస్తం ఇచ్చాను..........
సశేశం.....
Comments