Heart break.......... The End The Story


LAP TOP లో చంద్రుడు - కల చెదిరింది కధ మారింది

ఆ అమ్మాయి వేగం గా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది
వీడు ఆ వేగాన్ని అందుకోడానికి ఇంకా వేగం గా నడుస్తున్నాడు
అసలు వీడేం చేస్తాడో చూద్దాం అని నేను మా Friend ఇద్దరం వాడి వెనకాలే వెళ్ళాం

వాడు almost ఆ అమ్మాయిని reach అయ్యాడు..

Generally ఎవరైనా coincidence లాగ అనిపించాలంటే అమ్మాయి కి ఎదురయ్యి "Hi" చెప్తారు
వీడు variety గా వెనకనించి వెళ్ళి " hi!!! " అని అన్నాడు
ఆ అమ్మయి కంగారు పడి తిరిగి చూసింది
ఆ expression చూసి మేమిద్దరం పక్కకి Jump... :D

వీడు " Hello అండి గుర్తుపట్టలేదా?? " అని అడిగాడు
దానికి ఆ అమ్మయి LKG పిల్లాడికి Boyles Law చెప్తే ఏ expression ఇస్తాడో ఆ expression ఇచ్చింది ..

కాని ఆ అమ్మాయి Body gyard మాత్రం వీడిని గుర్తు పట్టింది..
"Hey ఈ అబ్బయి వెంకీ, మొన్న lunch లో మన friend introduce చేసింది కదా మర్చిపోయావా ?" అని గుర్తుచేసింది....

దానికి తను హా అని అంది ..
మొత్తానికి మనోడు ఆ అమ్మాయి తనతో తొలిసారి మాట్లాడినందుకు full happy,

ఆ ఆనందం లో మనోడు ఇంకేమి మాట్లాడాలో అర్థం కాక

" మీది గాజువాకా ?" అని అడిగాడు
ఆ అమ్మాయి అప్పుడు
ముక్కు మొహం తెలియని చంటి పిల్లాడికి ఎవరయినా Chocolate ఇస్తే మొహం ఎలా పెడతారొ అలా పెట్టింది
hmm అన్నట్టు తల ఊపింది

మనోడు మళ్ళీ happy ( ఎందుకని అడుగుతారా ?? అర్థం కాలేదా రెండో సారి మాట్లాడింది కదా)

బొమ్మరిల్లు cinema లో హాసిని లాగా " కదా!! నేను అప్పుడప్పుడు వైజాగ్ వచ్చి వెళ్తుంటాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అన్నాడు"

అంతే
ఆ అమ్మాయి ఏమి మట్లాడకుండా వెళ్ళిపోయింది వీడు విజయోత్సాహంతో తిరిగి వచ్చేసాడు ...

CUT చేస్తే

Next Day మేము office లో messenger లో మాట్లాడుకుంటున్నాం

ME:ఏ రా అసలేమైంది ఎందుకలా జరిగిందంటావ్ ?
Venky:ఏమో రా నాకేం తెలీదు నేనేమి చేయలేదు నేను వినాయక చవితి రోజు నా LAP TOP లో చంద్రుడిని చూసాను బహుశా అందుకే అనుకుంటా నాకిలాంటి నీలాపనిందలు వస్తున్నాయి


ME: *&^^%%%??? //// #$$

****
మొత్తానికి జరిగిందేంటంటే
మనోడు మాట్లాడినట్టు తనతో ఎవ్వరూ ఇంతవరకు మాట్లాడలేదటా
ఆ అమ్మాయి సిగ్గుతో కాకుండా భయంతో పరుగెత్తుకుంటూ వెళ్ళి
వెళ్ళే దారిలో మా friend కి phone చేసి
"యావండీ మీరు మొన్న lunch లో పరిచయం చేసిన అబాయొచ్చి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడండి నాకు భయమేసి నేను auto ఎక్కేసాను" అని చెప్పింది ..

అసలు జరిగిన విషయం తెలుసుకుని నేను వాడికి ముందు రోజు రాత్రే చెప్పేసాను
వీడు పాపం మా friend కి sorry చెప్పడానికి phone చేస్తే ఆ call మన heroine body guard ఎత్తింది
వీడు ఎవరు phone ఎత్తారో కూడా తెలుసుకోకుండా sorry చెప్పాడు
ఆ అమ్మాయి పెద్ద build up ఇస్తూ
"Be careful see to it that this wont be repeated" అని deadly warning ఇచ్చింది

వీడికి అప్పుడు అర్థమయ్యింది phone ఎత్తింది మా friend కాదు body guard అని

మొతానికి మా వాడు అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి,,,

నేను చచ్చి చెడి మా friend తో appointment కుదిరిస్తే
మనోడు confess చేసేసుకున్నాడు

దానికి మా friend
"మొత్తానికి Good Boy Bad Boy అయిపోయారు కదా" అని అంది

ఎంత నాకు మా friend కి వీడు Good Boy అయినా
వీడి heroine కి తన body guard కి వీడు గాలి గాడిలా మిగిలిపోయాడు


మరుసటి రోజు నించి షరా మామూలే
నన్ను ping చేస్తే నేను పోకిరి లో మహేష్ బాబు లా
" అమ్మాయిలు మనకి correct కాదు రా " అని ఓ పెద్ద dialog...

మా వాడు మళ్ళీ పుస్తకాలు codeలు అని వాడి ప్రపంచం లోకి మునిగి పోయాడు


నేను మరీ ఇలా పుస్తకాల పురుగుని కాకపోయినా exams దెగ్గరపడతున్నాయిగా
అసలేం subjects ఉన్నాయి ఈ సారి అని discovery starte చేసాను

ఇవండీ మా వాడికి వచ్చిన నీలాపనిందలు

అవీ LAPTOP లో చంద్రుడిని చూసినందుకు .. !!!!

*********

Comments

Viswa Ravi said…
baagundabbayi :) nee rachanaa chaatruyam :)...

aa venky full name emiti, inko frnd evaru, aa ammayi evaru, nee inko frnd ki telisina ammayi evaru...
body guard evaru ... naku teliyaali naaku teliyali teliyaali :):):)
Raja said…
anii alaa adigeyakodadu abbayi
konni theliyakapovadamey manchidi :)

Popular Posts