సామెతలు -- సంగతులు :)

ఏం చేయాలో తెలియక ఏం రాయాలో తెలియక ఏదో ఒక్కటి రాద్దాము అని మొదలు పెట్టిన బ్లాగ్ ఇది
ఏం చేయాలో తెలియకపోడానికి కారణం ఖాళీగా ఉండటం ఏం రాద్దామో తెలియక పోడానికి కారణం ఖాళీగా ఉండకోడదు ఏదో ఓ పని చేయాలన్న ఆలోచన

సరే సామెతల తో మొదలు పెడదాం అని అనుకున్నా
ఒక్కో సామెతకి ఓ చిన్న సన్నివేశం :)

రాస్తున్న బ్లాగ్ ఆద్యంతం ఆసక్తిగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను మరి ఆసక్తి గా ఉందో లేదో మీరే చెప్పాలి

మొదటి సామెత

అన్నప్రాసన రోజే ఆవకాయ కావాలనడం

ఈ సామెత గురించి చెప్పాలంటే
నా మిత్రుడు ఉదయ్ గురించి చెప్పాలి
ఎవరి జీవితాన్నైనా విధి ఒక్కసారి వెక్కిరిస్తుంది
కానీ వీడి జీవితాన్ని విధి వెక్కిరిస్తూనే ఉంటుంది (ఊరికే సరదాకి అంటున్నా)
రెండేళ్ళలో వీడు పడిన కస్టాలు మాకు తెలుసు కాబట్టి అలా అన్నాను

ఇక సామెత గురించి చెప్పాలంటే నా లాగే వీడు కూడా ఖాళి
నా లాగే వీడు కూడా బెంచి మీద ఉంటూ ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నాడు
వీడి ప్రొఫైల్ కి సరి పడే ఒక ప్రాజెక్ట్ గురించి మా ఇంటర్నల్ సైట్ లో పడినప్పుడు
వీడు వేసిన ప్రశ్నలకి నాకు ఈ సామెత అర్థం తెలిసొచ్చింది :)

ప్రొఫైల్ ప్రాజెక్ట్ కి సూట్ ఆతుందో లేదో చేసి కనుక్కోరా అని నేను వీడికి చెప్తే
వీడు " ఒరేయ్ ఆ ప్రాజెక్ట్ లో బిల్లింగ్ ఇస్తరంటావా లాంగ్ టర్మ్ అంటావా ?" అని అప్లై చేయకుండానే అడుగుతాడు
అప్పుడు నేను వాడికి ఇచ్చిన సమాధానం "అన్నప్రాసన రోజీ ఆవకాయ తింటాను" అంటావేంటి రా అని :).


*********

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది

ఇక రెండో సామెతకి వస్తే నేను మీకు నా ఇంకో మిత్రుడి గురించి చెప్పాల్ వీది పెరు కామేష్
వీదొక పెద్ద అంతు వ్యాధి లాంటి వాడు
చిన్నప్పటి నించి కలిసి ఉన్నం కాబట్టి నిస్సంకొచంగా చెప్పా

పరీక్షలకి చదువుదం అని వీడితో కలిసి కూర్చుంటాం
ఒక గంత సేపు బానే చదువుతాం
గంత తరవాత మొదలవుతుంది వీడి గోల
" ఓరే మనకి 23 ఏల్లు వచ్చి మనం ఇలా పుస్తకాలు తిరగేస్తుంటే నాకు సిగ్గేస్తుంది అని అంటాడు
ఆంతే మాకందరికీ ఆ భావన లెక పొయినా అది ఒచ్చేస్తుంది
మా చదువు చెట్టెక్కుతుంది

మిగథ విషయాల్లో మావాడు మంచి వెధవే కానీ ఈ ఒక్క విషయం లొనే

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
అని అనిపిస్తుంది

మిగతా సామెతల సంగతి అలా ఉంచితే నాకు మాత్రం ఏదొ రాయాలి కదా అని ఈ బ్లాగ్ రాస్తున్నాను అని ముందే చెప్పా కదా

ఇలాంటి పనులు చేసినప్పుడే

పని లేని మంగలోడు పిల్లి తల గొరిగాడు అన్న సామెత గుర్తొస్తుంది :)

ససేశం ....

Comments

Unknown said…
hi,

Annaprasana roje avakai, is really good. Even the remaing part also good. Why am specifing the first one is, am also friend of Uday.

Regards,
Ravikanth
Rameswaram poyinaa saneeswaram vadaladu ani --- blog lo post chesina comment ki kooda oka format avasarama abbayi :-) :-)

salutations, signature -- email chesinattu :-)

Popular Posts