నీ ప్రశ్నలు నీవే
A Beautiful Song From the Movie
Kotha Bangaaru Lokam
Very beautiful Lyrics by Sirivennela Seethaa Rama Sastry
Seetaa Rama Saastry once said in an Interview that
"The director of the movie has made me revise the lyrics of this song for more than 13 times and finally I have got this song, this is the first song of mine that has taken this many attempts"
As the Writer said The result is a song with perfect lyrics and the one who gave another life to the song is None other than Mr Perfect SPB
Mickey J Mayor did his job up the mark....
very apt situation in the movie too.
Enjoy The Lyrics
నీ ప్రశ్నలు నీవే
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వ్రుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపొదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వల వేస్తుందీ వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే యేదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలెవా
పొరబాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటలా తన పాటం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపొదే నువ్వొచ్చేదాకా
నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపొదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వల వేస్తుందీ వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే యేదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలెవా
పొరబాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటలా తన పాటం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపొదే నువ్వొచ్చేదాకా
Comments