Raama Chakkani Seethaki --- GODAVARI


Lyrics of a beautiful song from the movie GODAVARI


Enjoy


రామ చక్కని సీత కి



నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీరమణా

మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా

రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట

రామ చక్కని సీతకీ

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి ఎవ్వడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లుని ఎత్తిన ఆ రాముడే

ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో

రామ చక్కని సీతకీ


ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే

చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే

నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు

రామ చక్కని సీతకీ
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా

నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే

చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా


రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట

ఇందువదనా కుందరదనా మందగమనా భామా

ఎందువలనా ఇందువదనా ఇంత మదనా ప్రేమ

Comments

Popular Posts